చరిత్రలో ఈరోజు జనవరి 20
సంఘటనలు
1957: భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
1993: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
1995: తాజ్మహల్ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2009: అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
2010: నైజీరియాలో మతఘర్షణలు చెలరేగి 200 మంది మృతిచెందారు.
2011: భారత దేశము : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.
జననాలు
1907: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
1920: బి.విఠలాచార్య,’జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
1940: కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త. (మ.2022)
1960: విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
మరణాలు
1900: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
1988: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ గా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
2008: సయ్యద్ హుసేన్ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)
2016: తిరుమాని సత్యలింగ నాయకర్, మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
2016: సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)