TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయని అధికారులు ప్రకటించారు. తెలంగాణలో ఇవాళ మొత్తం విద్యాసంస్థలకు ప్రభుత్వం శివరాత్రి హాలిడే ప్రకటించింది.

అయితే.. కొన్ని జిల్లాలకు రేపు కూడా హాలిడే ఉండనుంది. శివరాత్రి సందర్భంగా ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మూడు ఉమ్మడి జిల్లాల విద్యాసంస్థలకు ప్రభుత్వం శివరాత్రి మరుసటి రోజున కూడా సెలవు ప్రకటించింది. ఈనెల 27వ తేదీన అంటే రేపు టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రులు ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ -నిజామాబాద్-అదిలాబాద్-మెదక్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్త జిల్లాల ప్రకారం.. 24 జిల్లాల్లో… ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయని ప్రకటించారు అధికారులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

school holidays