TRINETHRAM NEWS

To immerse the Lord Ganesha, who is worshiped with devotion, in the peaceful atmosphere of Nava Ratri

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు
పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద సోమవారం రోజున గణపతి నిమజ్జన వేడుకలను పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ కలిసి వేడుకలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
అనంతరం వేదపండితులు ఎమ్మెల్యే వేదమంత్రాలతో ఆశీర్వాదింది సన్మానించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ..

పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు జరుపుకొని నేడు నిమజ్జనం కార్యక్రమాలను జరుపుకుంటున్నారన్నారు. ఇట్టి నిమజ్జన వేడుకల్లో ప్రజలు సంయమనం పాటించి నియమ నిష్ఠలతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్టపై నిమజ్జన వేడుకలకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖవారు పెద్దపల్లి సబ్ డివిజన్లోని పోలీసు బలగాలను అణువణునా మోహరించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ శాఖ సర్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ నుండి భారీ క్రేన్లను తెప్పించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశామని ఈ సౌకర్యాలను ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

To immerse the Lord Ganesha, who is worshiped with devotion, in the peaceful atmosphere of Nava Ratri