రాష్ట్రంలోనికి కార్మికులకు టిఎన్టియుసి అండగా ఉంటుంది
ఐ టి సి ఎన్నికల్లో టిఎన్టియుసి గెలుపును స్వాగతిస్తున్నాం నిమ్మకాయల ఏడుకొండలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భద్రాచలం ఐటిసి పేపర్ మిల్ కార్మిక సంఘ ఎన్నికల్లో రాజీలేని పోరాటాలు చేసి కార్మికుల హక్కులను కాపాడడంలో ముందుబాగాన నిలబడిన టి ఎన్ టి యు సి ని గెలిపించిన ఐటిసి కార్మికులకి శనివారం గోదావరిఖని టిడిపి, టి ఎన్ టియు సి పక్షాన ఉద్యమాభి వందనాలు తెలిపారు. బూర్గంపాడు మండల ఐటిసి కర్మాగారంలో శుక్రవారం నిర్వహించిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టి ఎన్ టి యు సి 60 ఓట్ల ఆదిక్యంతో విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 1250 ఓట్లు పోలయ్యాయి. టిఎన్టియుసికి 480 ఐఎన్టీయూసీకి 420 ఓట్లు, బి ఆర్ టి యు కి 321 ఓట్లు, బిఎంఎస్ కి 21 ఓట్లు పోలైనట్లు మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఐ టి సి టిఎన్టియుసి అధ్యక్షుడు కనుక మేడల హరిప్రసాద్,పోటు రంగారావు నేతృత్వంలో వరసగా మూడవసారి విజయం సాధించారు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు, సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఉన్న సంఘటిత అసంఘటిత నాయకులు కార్మికులు టిఎన్టియుని బలోపేతం చేసి గెలిపించుకోవాలని కే నిమ్మకాయలు ఏడుకొండలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, టీ మణిరాం సింగ్ టి యెన్ టి సి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అండ్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ నాయకులకు, కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముదుగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టిసి అధ్యక్షుడు, సల్ల రవీందర్ పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్, గుండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బేక్కం వీరేందర్ టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీస్ ఇంచార్జ్, మాటేటి లక్ష్మి టిఎన్టియుసి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నరెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, బరిగెల కళావతి రాష్ట్ర మాజీ మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి, రోడ్డ బానమ్మ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, కూసి నర్మదా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకురాలు, కామెర రాజబాబు ఎస్సీ సెల్ రామగుండం మాజీ అధ్యక్షుడు, కనకం పోచమ్మల్లు ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు, సుందిళ్ల స్వామి ఎస్సీ సెల్ టౌన్ కార్యదర్శి మాజీ, రామగిరి రాజేశ్వరి టౌన్ కార్యదర్శి, ఏల్పు కొండ నర్సయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App