ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ సిద్దు జొన్నలగడ్డే.
కథకుడుగా ఎక్కువ మార్కులేం రావు కానీ, సంభాషణల రచయితగా నూటికి నూటొక్క మార్కులు వేయొచ్చు.
టిల్లు పాత్రని పూర్తిగా అర్థం చేసుకొన్నాడు కాబట్టే.. అంత ఆసువుగా మాటలు రాసేశాడు.
కొన్ని పోలికలు, ఛమక్కులు భలే పేలాయి.
సీన్ అంతా ఒక ఎత్తు… చివర్లో టిల్లు చెప్పే డైలాగులు మరో ఎత్తు.
టిల్లు ఎప్పుడు మాట్లాడతాడా, అని ఆడిటోరియం వెయిట్ చేస్తుంటుంది.
అక్కడే ఈ సినిమా, ఆ పాత్రా పాసైపోయాయి.