
డిండి (గుండ్లపల్లి) మార్చి 27 త్రినేత్రం న్యూస్
వడ్డెర గూడెంలో ఘనంగా ఈ దమ్మా బోనాలు
అమ్మవారికి ఊరంతా బోనాలు సమర్పణ
చల్లగా చూడాలని వెదుకున్న గ్రామ ప్రజలు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంవవిల్ కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర గూడెం గ్రామంలోప్రతి ఏడాది కన్నుల పండుగలా వడ్డెర లు భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ఈధమ్మబోనాలపండుగా ఈ సం, కూడ గురువారం ఘనంగా నిర్వహించారు వూరి మహిళలు బోనాలు ఎత్తు కొనిడప్పు చప్పుళ్ళతో భారీ జన సందోహం నడుమ పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఊరంతా భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఏక తాటి పై ఈ పండుగను జరుపుకోవడం విశేషం.
చిరకాలం అమ్మవారి ఆశీస్సులు తమపై చల్లని దీవెనలు వుండాలని పాడిపంటలతో అన్ని విధాలా ప్రజలు బాగుండేలా ఆశీర్వదించాలని గ్రామపెద్దలు ఈదమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ బోనాల కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఓర్సు ముత్యాలు,మాజీ ఎంపీటీసీ ఒర్సు అంజయ్య, బత్తుల శ్రీను,వెంకటయ్య,సర్పంచేంకట్య,తిరుపతయ్య,జగన్,వెంకటయ్య,,గణేష్,లక్ష్మీనారాయణ,రాములు,,సహదేవ్,రమేష్,బుచ్చయ్య,పెద్ద వెంకటయ్య,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
