
అమృత పైపులైన్ల మార్పిడి వలన ముడి నీటి భూగర్భపైపులైన్ల లీకేజీలు నిత్యకృత్యం అయ్యేవిధంగా వున్నాయి.
ప్రత్యక్ష పరిశీలనతో ప్రభుత్వానికి నివేదిక. పౌరసంక్షేమ సంఘం
(3.4.2025)
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు చందంగా కాకినాడ నగర పాలక సంస్థ త్రాగునీటి సరఫరా తయారయ్యిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్ నీటి నిల్వలను ఏ డి బి రోడ్డు విస్తరణలో చిద్రమైన నూతన పైపు లైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రమణ రాజు మాట్లాడుతూ అమృత పథకంలో కోట్ల రూపాయలు వెచ్చించి సాంబమూర్తి రిజర్వాయర్ నుండి గోదావరి జలాల ముడి నీరు శశికాంత్ నగర్ కు చేరేందుకు వేసిన భూగర్భ పైపు లైన్లు నిర్మాణం విజన్ డాక్యుమెంట్ లేకుండా చేయడం వలన రోడ్డు విస్తరణలో వాటిని తొలగించి కొత్త పైపులు నిర్మాణం చేయాల్సిన పనులను జాతీయ రహదారి శాఖ నిర్వహి స్తున్నదన్నారు. ప్రస్తుతం వేసిన పైపు లైన్లు పాత పైపు లైన్లను మించిన నాణ్యత లేకపోవడం వలన అమర్చిన గొట్టాలు క్రింద బల్లపరుపుగా లైన్లు వేయక బరువుకు తొక్కేయడం వలన భారీ లీకేజీ ఏర్పడింద న్నారు.
ఈ కారణంగానే గురువారం సాయంత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు నీరు సరఫరా ఆగిపోయిన దుస్థితి వచ్చిందన్నారు. రోడ్డు విస్తరణలో గత రెండు నెలలుగా జరుగుతున్న పాత భూగర్భ పైపు లైన్లు మార్చి కొత్తవి అమర్చిన పనుల్లో నగర పాలక సంస్థ నుండి తగిన పర్యవేక్షక ఇంజనీర్ల బృందం లేకుండా దిగువ స్థాయికి విడిచి పెట్టడం వలన నాసిరకంగా పనులు పూర్తి చేసి కప్పెట్టడం జరిగిందన్నారు. ఏడిబి రోడ్డు పనులు పూర్త య్యాక సంబధిత కేంద్ర కాంట్రాక్టర్లు వెళ్ళిపోతా రని ఆ తరువాత ఏర్పడే లీకేజీలు నగర పాలక సంస్థ భరించా ల్సి వుంటుందని ఈ రకంగా ఏడాది పొడవు నా ఇదే రకమైన త్రాగు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుం దన్నారు. సాంబమూర్తి నగర్ రిజర్వాయర్ లో నాలుగు అడుగుల మేట పేరుకుపోయి వుండగా గోదావరినీరు నిల్వల సామర్థ్యం 35అడుగులు వుండాల్సి వుండగా 31న్నర అడుగుల వరకు నిల్వవుంద న్నారు. రిజర్వాయర్ గట్లు జారిపోతున్న దుస్థితి వుందన్నారు. రెండు దశాబ్దాల క్రిందట వేసిన గట్లు నెర్రలు వేసి జారి పోకుండా వుండే రివెంట్మెంట్ పనులు చేయలేదన్నారు.
అడుగున మేట వేసిన నాలుగు అడుగులు సిల్ట్ వ్యర్థాలు తీయక పోవడం వలన 26న్నర అడుగులకు మాత్రమే నీటి నిల్వల లెక్క పరిమితం అవుతున్న దన్నారు. ప్రస్తుతం భూగర్భ పైపు లైన్ల ద్వారా వున్న నీటిని లీకేజీ వద్ద పూర్తిగా వదిలేస్తే తప్ప రిపేర్లు చేయలేని వాతావరణం వుందన్నారు. ఈ మేరకు గొట్టాల్లో నీరు లేకుండా చేయడానికి 18లక్షల కిలో లీటర్ల నీరు వృధా చేందుతు న్నదన్నారు. కార్పోరేషన్ పనుల్లో ముందుచూపు నిర్వహణ లేకపోవడం వలన అమృత పథకం పనుల్లో భూగర్భ పైపు లైన్లు అమర్చి వృధా చేయగా ఇప్పుడు నాసిరకం పైపులతో మార్పు జరిగి తొలి విఘ్నం భారీగా ఏర్పడిందన్నారు. ఈ విఘ్నాలు నిరంతరం జరిగే విధంగా వున్న వైఖరి అక్కడ జరిగిన బాధ్యతారాహిత్య పనుల్లో స్పష్టంగా తెలుస్తున్నదన్నారు.
ఆరట్లకట్ట వద్ద మోటార్ల పంపింగ్ ద్వారా ప్రతినెల లక్షల రూపా యల కరెంటు బిల్లులు వృధా అవుతున్నాయ న్నారు. ధవళేశ్వరం నుండి భూగర్భ పైపు లైన్ల మార్గాన్ని ఏర్పాటు చేస్తే కరెంటు ఖర్చులు భారాలుఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన గోదావరి నీటి నిల్వలు తగ్గుతాయన్న బెడద వుంటే ఏలేశ్వరం ప్రాజెక్ట్ నుండి భూగర్భ పైపు లైన్లు అమరిక చేయిస్తే శాశ్వత సురక్షిత ముడి నీరు లభ్యం అవుతుంద న్నారు. ప్రస్తుతం చేరుతున్న ముడినీరు విధ్వంసకరంగా వుంటున్న తీరు తొలగు తుందన్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ కరోనా విపత్తు వలన ఆగిపోయిందని ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి గా వున్నందున రూ.300కోట్ల అంచనాతో వున్న భాగర్భ పైపు లైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణ రాజు కోరారు. జ్యోతుల సీతారామ మూర్తి హయాంలో 25 సంవత్సరాల విజన్ వలన త్రాగునీరు దక్కిందన్నారు.
ప్రస్తుతం స్మార్ట్ సిటీ కి తగిన గ్రేటర్ అప్ గ్రేడ్ విజన్ లేకపోవడం వలన ప్రజాధనం దుర్వినియోగ మవుతున్నదన్నారు. కాకినాడకు శాశ్వత స్థాయిగా భూగర్భ పైపు లైన్ల ద్వారా పంపింగ్ అవసరం లేని రీతిలో ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం వున్న వాటర్ వర్క్స్ కు శశికాంత్ నగర్ పాయింట్ కు ముడి నీరు చేరే ప్రణాళిక అమలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్ లో కమీషనర్ సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే పార్లమెంట్ మెంబర్ రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు సమీక్ష నిర్వహించే సంప్రదాయం లేకపోవడం వలన సమస్యలు జఠిలం అవుతున్న దుస్థితి వుందన్నారు. సి ఎం డిప్యూటీ సి ఎం కాకినాడ జిల్లా కేంద్రంలో పరిస్థితులు మెరుగుపర్చాలని కోరారు. ప్రత్యేక నివేదిక ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.
ఫోటో:
సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్.. రోడ్ల విస్తరణ పనుల్లో తీసేసిన అమృత పైపు లైన్లు.. ఆదిలోనే హంస పాదుగా లీకేజీతో భారీగా నీరు వృధా చెందుతున్న భూగర్భకొత్త లైన్లు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
