
Trinethram News : తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్ టి సి బస్టాండ్ ముందర గత రెండేళ్ల క్రితం నెలకొల్పిన మహనీయుల విగ్రహల ముసుగులను తొలగించి, ఆవిష్కరణ చేయించేలా సహకరించాలని కోరుతూ తిమ్మాపూర్ మండల జేఏసి సభ్యులు శనివారం రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విగ్రహాల ముసుగులు తొలగించాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని జేఏసీ సభ్యులు తెలిపారు.
రెండేళ్ల నుండి ప్రతీ రోజు ఆర్ టి సి అధికారులు బందోబస్తు పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సంజయ్ కి తెలిపారు. వెంటనే విగ్రహల ముసుగులు తొలగించి, ఆవిష్కరణ చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సభ్యులు సుగుర్తి జగదీశ్వరాచారి, మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య లు కోరారు.మాజీ మేయర్ వై. సునీల్ రావ్, పార్టీ నాయకులు సొల్లు అజయ్, బత్తుల లక్ష్మీనారాయణ జే ఏ సి సభ్యుల వెంట ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
