TRINETHRAM NEWS

ఇవి రోడ్లేన ఇంకెప్పుడూ సారు గుంతల రోడ్లు సక్కగా చేసేది.

అరకులోయ, త్రినేత్రం న్యూస్, ఛానల్ రిపోర్టర్. జనవరి 24.

యువ నాయకుడు ఐసుబాబు మాట్లాడుతు, సంక్రాంతి కళ్ళ గుంతల రోడ్లుపూడ్చి వేస్త ఆని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అన్న మాటలూ,మాటలవరకే పరిమితం ఐ నట్టు..కానవస్తుంది. వివరాల్లో కెళితే అరకులోయ మండలము సిరిగమ్ పంచాయతి పరిధిలో నీ కోడిపుంజువలస, నుండి సిరగం, వర్ర ,వెళ్లే రహదారి గుంతలు పడిపోవడం, కాంక్రీట్ రాళ్లు బయటకు వచ్చేయడం జరిగింది.

ఈ రోడ్డు సుమారుగా పాడైపోయి ఐదు సంవత్సరాలు దాటుతుంది ఇక్కడ వాహనాలు గాని అంబులెన్స్ గాని రాకపోకల యందు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి. గర్భిణి స్త్రీలను అరకువేలి ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి, కూడా కష్టంగా ఉంది అలాగే సచివాలయం సిబ్బంది కూడా రాకపోకల యందు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే సిరిగం పంచాయతీ ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, గిరిజనులు డిమాండ్ చేస్తునరు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App