TRINETHRAM NEWS

ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి విమానయాన రంగంలో లైసెన్స్‌/ ఇంజినీరింగ్‌/ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులు కోర్సును బట్టి సంబంధిత గ్రూపులో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 14 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 31, 2024వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.1,200, మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి

కోర్సుల వివరాలు

⚡లైసెన్స్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (డీజీసీఏ), కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఈఏఎస్ఏ).

⚡ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.

⚡గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్‌), బీఎస్సీ(ఏఎంఈ)

⚡సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్.

ముఖ్యమైన తేదీలు..

📌ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2024.

📌అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: ఏప్రిల్ చివరి వారం, 2024.

📌ప్రవేశ పరీక్ష తేదీ: మే మొదటి వారం, 2024.

📌ఫలితాల విడుదల తేదీ: మే రెండో వారం, 2024.

📌అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ: మే మూడో వారం, 2024.