TRINETHRAM NEWS

రాష్ట్రం లో నిర్బంధ పాలన సాగుతుంది

మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రం లో నిర్బంధ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమం లో భాగంగా గోదావరిఖని మైనార్టీ హస్టల్ పాఠశాలను సందర్శనకు వేళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గురుకుల పాఠశాలలో విద్యార్థులు సరైనా వసతులు అందటం లేదని సరైనా భోజనం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడం జరిగిందని ఈ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటిఆర్ గురుకుల బాటకు పిలుపునివ్వడం జరిగిందని గురకులాల్లో విద్యార్థులు పరిస్థితి వారి స్దితిగతులని తెలుసుకునేందుకు వస్తే పాఠశాల అధికారులు అనుమతులు లేవంటూ మాట్లాడుతున్నారని ఇది దుర్మార్గపు పాలనకు నిద్శనమన్నారు. ఇప్పటికీ వరకు 48 మంది గురుకుల విద్యార్థులు మృతి చేందారని చెప్పారు.గురుకుల పాఠశాలల్లో పిల్లలకు ఏ ఇబ్బందులు కలిగిన పూర్తి భాద్యత పాలకులు ప్రిన్సిపల్ వహించాలన్నారు. నిర్బంధ పాలనకు ప్రజలనుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ కల్వచర్ల కృష్ణ వేణీ నాయకులు అచ్చే వేణు నారాయణదాసు మారుతి చుక్క శ్రీనివాస్ సట్టు శ్రీనివాస్ బోడ్డు రవీందర్ జడ్సన్ ఇరుగురాళ్ల శ్రావన్ కిరన్ జీ రామారాజు ఆవునూరి వెంకటేష్ చింటూ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App