![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-20.24.14.jpeg)
బర్డ్ ఫ్లూ పై అపోహలు వద్దు
రోగలక్షణ కేసులను గుర్తించడానికి 64 వైద్య బృందాలతో ఇంటింటి సర్వే
34 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాం. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
చికెన్ షాపుల్లో పనిచేసే కార్మికులకు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైరస్ ఇతర యానిమల్స్ కి సోకకుండా ముందస్తుగా వాక్సినేషన్ వేస్తున్నాం.
కానూరు అగ్రహారంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ప్రభావిత ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న..
Trinethram News : జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీకోళ్లకు సంబంధించి భోపాల్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ గా నిర్ధారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియచేశారు..
మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కానూరు అగ్రహారంలోని (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా) ప్రభావిత ప్రాంతాన్ని రెవిన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖ ల అధికారులతో కలసి పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కానూరు అగ్రహారంలో మూడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని, ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటిని నిర్ధారణచేసి వాటిని పెస్టిసైడ్స్ తో క్రిమిసంహారము చేయటం జరిగిందన్నారు. అదే విధంగా ఒక కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఇక్కడ పౌల్ట్రీ నుంచి బర్డ్స్, ఎగ్స్ బయటికి రాకుండా చేసామన్నారు. ఈ ప్రాంతం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించామన్నారు. ఈ ప్రాంతంలో చికెన్ షాపుల్లో పని చేసి వారిని గుర్తించి వారికి సాబ్ టెస్ట్ లు కూడా చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కాకినాడ ల్యాబ్ నుంచి సాబ్ సాంపిల్స్ తీసుకుని హ్యూమన్ కు వైరస్ లేదనే నిర్ధారణ చేసుకోవలసి ఉందన్నారు. ఒక కిలోమీటర్ పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ బృందం డోర్ టు డోర్ వైరస్ లక్షణాలను గుర్తించేందుకు క్యాంపెయిన్ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 34 గ్రామాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నమన్నారు. మండల స్థాయిలో రెవెన్యూ పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక శాఖలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. పశుసంవర్ధక శాఖ వారు ఈ వైరస్ ఇతర యానిమల్స్ కి సోకకుండా వాక్సినేషన్ అందిస్తున్నారన్నారు. అదే విధంగా బరియల్ సంబంధించిన అంశాలన్నీ రెవిన్యూ శాఖ అధికారులు, పౌల్ట్రీ ఏరియాలోని ప్రదేశాన్ని సోడియం క్లోరైడ్ తో క్లీన్ చేసే పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు చేపట్టారని తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు జిల్లాలోని ఇతర మండలాల్లో ఎక్కడ ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో బర్డ్ నుంచి మనుషులకు ఎక్కడ వైరస్ సోకిన లక్షణాలు లేవన్నారు. ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో, పాఠశాలలకు ఒక వారం రోజులపాటు ఎగ్స్ సరఫరా నిలుపుదల చేసామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువ, ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుందన్నారు. కానూరు నుంచి కోళ్లు, క్రోడిగుడ్లు బయటికి వెళ్లకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు, ఇతర సమన్వయ శాఖలతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించామన్నారు. తద్వారా ఈ వైరస్ బయట ప్రబలకుండా ఉంటుందన్నారు. సీతానగరం, నల్లజర్ల లో కూడా మంచి రిపోర్టు వచ్చిందని, ఏ ఏరియాలో బర్డ్స్ చనిపోయాయో ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి శానిటేషన్, ప్రోటోకాల్స్ పక్కగా నిర్వహించే పనులు చేపట్టామన్నారు. పౌల్ట్రీ నుండి ఉత్పత్తుల రవాణా నిలుపుదల చేసేటప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తో పాటు పౌల్ట్రీ యాజమాన్య సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. వైరస్ సమాచారాన్ని తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, పౌల్ట్రీ బర్డ్స్ మాత్రమే కాకుండా ఇతర పక్షులు ఈ వైరస్ తో ఎక్కడైనా చనిపోతే అటువంటి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.
సాధారణంగా వేసవిలో వైరస్ ఉంటుందని అందుకు సంబంధించి యానిమల్స్ వ్యాక్సినేషన్ వేయటం జరుగుతుందన్నారు. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) కోళ్లకు వచ్చిన వ్యాధి అని తగిన జాగ్రత్త లు పాటిస్తే మానవులకు ఈ వ్యాధి సోకదని, ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. కానూరు అగ్రహారంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి పర్యవేక్షణను చేపట్టి ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి దృష్ట్యా, వైద్య ఆరోగ్య శాఖ విధులు నిర్వహిస్తుందన్నారు.
10 కిలోమీటర్ల పరిధిలో వైద్య బృందాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHCలు) కానూరు, సమిశ్రగూడెం, మార్కండపాడు , పెరవలి, ఉండ్రాజువరం, వేలువెన్ను , సీతానగరం మండలాల పరిధిలోని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రోగలక్షణ కేసులను గుర్తించడానికి ఇంటింటి పర్యవేక్షణలో ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తో కూడిన 64 బృందాలను నియమించామన్నారు. అవసరమైన వారికి అవగాహన కార్యక్రమాలు, వైద్య సహాయం అందించడానికి సంబంధిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. “ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా “ నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. చికెన్ షాపుల్లో పనిచేసే కార్మికులకు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు.
ఈ పర్యటన లో కలెక్టర్ వెంట ఆర్డీవో రాణి సుస్మిత, డిఎంహెచ్ఓ డా. కె. వెంకటేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి. శ్రీనివాసరావు, డిపిఓ వి. శాంతామణి, రెవెన్యూ, పోలీస్, సచివాలయం అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![There are no myths](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-20.24.14-1024x459.jpeg)