
పార్టీ విధేయుడు ఆర్కె జన్మదిన వేడుకలలో పాల్గొన్న,అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి,
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం
అనపర్తి:- కుతుకులూరు గ్రామ ప్రజల హృదయాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) పై అభిమానం ఎప్పుడూ ఉంటుందని ఇతర పార్టీలు ఎన్ని బెదిరింపులు చేసినా కుతుకులూరు గ్రామ ప్రజలు ఓటర్లు వైయస్‌ఆర్‌సీపీ వైపే ఉంటారని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.
సోమవారం రాత్రి కుతుకులూరు కోటేశ్వర స్వామి కాలనీ నందు జరిగిన వైయస్‌ఆర్‌సీపీ అనపర్తి నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షులు పడాల దుర్గారెడ్డి(ఆర్ కె) 36వ జన్మదినోత్సవ వేడుకలలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్కే అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పలువురు అభిమానులు, ప్రజా ప్రతినిధులు మధ్య పడాల దుర్గారెడ్డి కట్ చేశారు.
అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆర్కే దుర్గారెడ్డి వైయస్‌ఆర్‌సీపీ ఏర్పడినప్పటి నుండి యువజన విభాగంలో పనిచేస్తూ ఎన్ని వ్యక్తిగత, రాజకీయ, కష్టాలు వచ్చినా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీకి విధేయుడుగా ఉండడం అభినందనీయమని, దుర్గారెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఇతర పార్టీలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కుతుకులూరు వైయస్‌ఆర్‌సీపీ నాయకుల సమిష్టి కృషి వలన కుతుకులూరు ప్రజలు ఓటర్లు వైయస్‌ఆర్‌సీపీ వైపే ఉంటారని అన్నారు. ఆర్కె పుట్టినరోజు సందర్భంగా ఆర్కే అభిమానులు ఏర్పాటు చేసిన బాణసంచా కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.
ఈ పుట్టినరోజు కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పులగం బులిరెడ్డి, కుతుకులూరు గ్రామ ఉపసర్పంచ్ సబ్బెళ్ళ నాగిరెడ్డి, వార్డు సభ్యులు చిర్ల వెంకట రామారెడ్డి, రామవరపు బుజ్జి , టేకి శ్రీనివాస్, తేతల భూపారెడ్డి, సబ్బెళ్ళ రామారెడ్డి, టిల్లాపుడి పట్టాభి, మండా సూర్రెడ్డి , నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి (దొరబాబు) తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
