సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలుపరచాలి
త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి
క్లెయిమ్స్ విషయంలో ఆన్లైన్ సేవను మెరుగుపరచాలి … వేలిముద్రలు పడక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులు .. రక్త పరీక్షల నమూనాలు సేకరించి రిపోర్టులు ఇవ్వ జాప్యం చేస్తున్న క్యాంపు నిర్వహకులు .. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి
భవన నిర్మాణ కార్మికులు క్లెయిమ్స్ చేసేటప్పుడు వేలిముద్రలు పడక ఇబ్బందులు పడుతున్నారని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో స్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవనిర్మాణ కార్మికులకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఆన్లైన్ సేవలను మెరుగు పరచాలని గత నాలుగు నెలలుగా క్లైమ్స్ అవ్వడంలేదని వాటిని త్వరగతగా పరిష్కరించాలన్నారు. హెల్త్ క్యాంపు నిర్వహకులు ఇంటింటికి తిరుగుతూ రక్త నమూనాలు సేకరించి కార్మికులకు రిపోర్టులు ఇవ్వడం లేదన్నారు.
క్యాంపు నిర్వాహకులను అడిగితే వారు ఇష్టం వచ్చినట్లు సమాధానాలు చెప్తున్నారు అన్నారు. రక్త నమూనాలు సేకరించడం ద్వారా కార్మికులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరునహరి రాజు, జనరల్ సెక్రెటరీ భైరీ శంకర్, కుంభం లక్ష్మీనారాయణ, ఇటిక్యాల సుధాకర్, పల్లెర్ల మల్లేశం, గుంటి సంతోష్, గడ్డం శంకర్, శ్రీనివాస్, పెద్దపల్లి మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, ఎలిగేడు మండల అధ్యక్షులు ఏసుదాసు, కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు మధుకర్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కొడిపాక స్వామి, మంథని మండల అధ్యక్షులు నామని పుల్లయ్య, రామగిరి మండల అధ్యక్షులు తొగరి చంద్రయ్య, సెంట్రింగ్ సంఘం అధ్యక్షులు మాటేటి మదనయ్య, ముత్తారం మండల అధ్యక్షులు కోలనీ కుమారస్వామి, సీనియర్ కార్మిక నాయకులు ఆరెపల్లి రత్నం, తాటిపాముల నర్సయ్య, శ్రీనివాస్ తదితర కార్మిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App