Trinethram News : అన్నమయ్య జిల్లా
జిల్లా కలెక్టర్ కు ఎన్ని అర్జీలు పెట్టిన రాయచోటి మండల తహశీల్దార్ కార్యాలయంలో న్యాయం జరగడం లేదని మనస్థాపం చెంది బాధితుడు అర్షన్ అహ్మద్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం….
తన తండ్రి సులేమాన్ రెవిన్యూ అధికారులు చుట్టూ తిరిగి తిరిగి మరణించాడు… నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని బాధితుడు అర్షధ్ అహ్మద్ అవేదన….
రిపోర్ట్ రాయకుండా అర్.ఐ, వీఆర్వో తిప్పుకుంటున్నారని బాధితుడు ఆరోపణ……
అడ్డుకున్న స్థానికులు, పోలీసులు…
తన తండ్రి పేరు మీద ఉన్న 75 సెంట్ల స్థలం ను ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోయినా అబుబకర్, ఖాదర్ బాషా అనే వ్యక్తుల పేర్ల మీద రెవిన్యూ అధికారులు ఎక్కించరని అవేదన….
రాయచోటి మండల పరిధిలోని గునిగుంట్ల రోడ్డు సర్వే నెంబర్ 800 లో గతం 30 సంవత్సరాల నుంచి తన తండ్రి అయిన సులేమాన్ పేరు మీద 75 సెంట్ల స్థలం ఉందని తెలిపిన బాధితుడు ఆర్షధ్ అహ్మద్….
రెవిన్యూ రికార్డు ప్రకారం గత 30 సంవత్సరాల నుంచి 1బి, అడంగల్, అర్ఎస్అర్,10 వన్లు తన తండ్రి సులేమాన్ పేరు మీద ఉందని తెలిపిన బాధితుడు ఆర్షధ్ అహ్మద్….
గతంలో విచారణ చేసి 75 సెంట్ల స్థలం సులేమాన్ దేనని విచారణ చేసి ఎండాస్మెంట్ ఇచ్చిన ఎమ్మార్వో సుబ్రమణ్య రెడ్డి…..
జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ కు స్పందన లో అర్జీ ఇచ్చి వచ్చి10 రోజుల అవుతున్న న్యాయం జరగడం లేదని అవేదన….
కలెక్టర్ గారు ఇచ్చిన స్పందన అర్జీని గునిగుంట్ల అర్ఐ, వీఆర్వో కు ఇచ్చిన రేపు, రేపు అని 10 రోజుల నుంచి ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిప్పి, ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు రాసి ఇస్తాం అని చెబుతున్న అర్ఐ, వీఆర్వో….
ఎన్ని సార్లు స్పందన అర్జీలు పెట్టిన అర్ఐ, వీఆర్వో, డిప్యూటీ ఎమ్మార్వో న్యాయం జరగడానికి ఇవ్వడం లేదు అవేదన……
సీఎం జగన్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్,ఎమ్మేల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితుడు అర్షధ్ అహ్మద్ అవేదన…