TRINETHRAM NEWS

రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్స్ లోని గదులను, వంట గదులను పరిశీలించారు. హాస్టల్ నిర్వహణ సిబ్బంది అందరూ నిబద్ధతగా పని చేయాలని, పరిశుభ్రంగా హాస్టల్ ను నిర్వహించాలని దీనిలో సిబ్బంది, విద్యార్థులు వ్యక్తిగత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థులను సొంత పిల్లలుగా భావించాలన్నారు. భోజనం రుచిగా, శుచిగా ఉండాలని వంటవారికి తెలియజేశారు. మెస్ లో భోజనం చేస్తూ అక్కడ ఉన్న విద్యార్థులకు ముద్దలు పెడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

హాస్టల్ లో ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకు రావచ్చునని చెప్పారు. ఇప్పటికే కొన్ని సమస్యలు గుర్తించామని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేశామన్నారు. చిన్నతనం నుండి ఎంతో గారాబంగా పెంచుకున్న తల్లిదండ్రులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరాలనే ఉద్దేశంతో హాస్టల్ లో చేర్చేందుకు అంగీకరిస్తారని వారి నమ్మకాన్ని వొమ్ము చేయకూడదన్నారు. హాస్టల్ విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా పుస్తకాలకు దగ్గరగా జీవించాలన్నారు. హాస్టల్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉంచాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, చీఫ్ వార్డెన్ ఆచార్య డి.జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

hostels