
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 06 త్రినేత్రం న్యూస్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షలో డిండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు (ఎంపీ పి ఎస్) చెందిన విద్యార్థులు సీట్లు సాధించి సత్తచాటారు. 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచి సీట్లు సాధించటం జరిగింది.
కుకుడాల తేజ శ్రీ, బషిపాక విశాల్,md మొయిన్, అవుట తేజశ్రీ, నీరటి శాన్వి, కొండపల్లి పల్లవి, గంధం యశ్వంత్, రామావత్ కావ్య, గుండమోని అశ్విత, ఎస్కే సోఫియా, లు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రామారావు ఉపాధ్యాయులు సందీప్, షాహిన్, బుజ్జి రాణి, శ్వేత, తరుణ్, ఆంజనేయులు, మరియు గ్రామ ప్రజలు అభినందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
