Trinethram News : ఎండల వేళ.. ఉరుముల వాన
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.