TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ : హైదరాబద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లోని ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీ కొట్టిన సాహిల్‌ అతని స్థానంలో డ్రైవర్‌ను పెట్టి దుబాయ్‌ పారిపోయాడు. ఈ కేసు వివాదంలో పలు ఆరోపణలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు