రక్షణ తెచ్చిన లోక రక్షకుడు
మానవాళి ముక్తి కొరకు మానవావతారీ అయిన దైవం
ఖనిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఖని,లో బుధవారం బిడిఎస్ చర్చిలో జరిగిన వేడుకలలో పాస్టర్ డిలైట్ రెడ్డి కేక్ కట్ చేసి ప్రసంగించారు.
యేసు పుట్టుక సర్వ మానవాళికి రక్షణ అందించిందన్నారు. పాప పంకిలమైన మానవజాతిని రక్షించడానికి ఏసుక్రీస్తు జన్మించాడని తెలిపారు. పాపాన్ని ,శాపాన్ని తద్వారా వచ్చిన మరణ భయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన సిలువ యాగం ద్వారా రక్షణ పొంది.. నిత్య జీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించిందని కొనియాడారు.
అనంతరం పేద క్రైస్తవ కుటుంబాలకు పిఎన్ఆర్ ట్రస్టు ద్వారా నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్వల, సంఘ యువ విశ్వాసులు జీవన్ రెడ్డి, అభిజిత్ ,పాల్ దీపక్, గ్రీష్మ, సుమంత్ ,జాన్, హెప్సీబా తో పాటు ఐపీఎఫ్ మీడియా కోఆర్డినేటర్ విలాసాగరపు శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App