TRINETHRAM NEWS

రోడ్డు వేశారు రంధ్రం మరిచారు
(బురద గెడ్డ వంతెన పెద్ద రంద్రం ఏర్పడి ప్రమాదకరంగా మారింది)

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి:19

వంతెన కూలిపోయే ప్రమాదకరం పొంచి ఉంది తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి.
రేండు మండలాల సరిహద్దు పురాతన బురద గడ్డ వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి పర్యటనలో భాగంగా అరకు సమీపంలో బురద గడ్డ వంతెనకు ఆనుకొని ఉన్న రోడ్డుకు పెద్ద రంద్రం ఏర్పడి చాలా ప్రమాదకరంగా మారింది .అని పరిశీలించడం జరిగింది. ద్విచక్ర వాహనదారులు చాలా సార్లు ప్రమాదానికి గురి అయి ప్రాణాలు కోల్పోయారు.వాహనదారుల ప్రాణాలు పోయే ప్రమాదము పొంచి ఉంది సుమారు మూడు సంవత్సరమునుండి ఈ మార్గంలో చాలామంది ఐ. ఏ .ఎస్. అధికారులు ఎంపీ మరియు ఎమ్మెల్యేలు. జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ప్రతినిత్యం ప్రయాణిస్తుంటారు కానీ ఈ ప్రమాదకర మార్గాన్ని ఏ ఒక్కరు కూడా పరిశీలించ పోవడం చాలా దుర్మార్గము.

ఇది అరకు. పాడేరు ప్రధాన మెయిన్ రోడ్డు కావడంతో నిత్యం స్థానికులు మరియు పర్యాటకులు వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉంటుంది ప్రమాదకరంగా ఉన్న సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు చేయకపోవడం చాలా దుర్మార్గమని ఇది సరికాదని పాచిపెంట చిన్న స్వామి ఆవేదన ప్రజాప్రతినిధులకు తెలియజేశారు ప్రమాదకరంగా ఉన్న వంతెనను సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రొజెక్టర్ అధికారి పాడేరు వారు ఎంపీ, మరియు ఎమ్మెల్యే, తక్షణమే స్పందించి పర్యాటక కేంద్రం అయిన అరకు పాడేరు ప్రధాన రహదారి ప్రమాదానికి పొంచి ఉంది తక్షణమే మరమ్మతులకు అధికారులు స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App