TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకు లోయ,,త్రినేత్రం న్యూస్, ఫిబ్రవరి 20: ఎట్టకేలకు సిఐటీయూ, గిరిజన సంఘాల ప్రథాన పాత్ర తో మృతుని బంధువులు నష్టపరిహారం దక్కింది .. వివరాల్లోకి వెళితే..
ఈనెల 16వ తేదీన అరకువేలి, ఏపీ టూరిజం కార్పొరేషన్, మయూరి రిసార్ట్, లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న లొలిత్ మాన్ పవర్, కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా మృతి చెందాడు. దీంతో ఏపీ టూరిజం వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు, గిరిజన సంఘం కుటుంబ సభ్యులతో కలిపి రిసార్ట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో యాజమాన్యం , స్థానిక రెవిన్యూ అధికారులు తో, ప్రజాసంఘాలు, చర్చలు చేసి, కుటుంబం లో ఒకరికి కారణ్య నియమకం, ద్వారా ఉద్యోగం, 5 లక్షల 25 వేల రూపాయలు మృతుడి కుటుంబానికి ఇవ్వడానికి సదరు యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఇచ్చారు,అని సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వర రావు తెలిపారు. టూరిజం కార్పొరేషన్ యాజమాన్యం తక్షణం కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించి.

విధి నిర్వహణలో మృతి చెందితే, 25 లక్షలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరకు టూరిజం ద్వారా కోట్లాది రూపాయలు కార్పొరేషన్, ప్రతి ఏడాది ఆదాయం వస్తున్న, పని చేస్తున్న కార్మికులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదు. అని అన్నారు అదేవిధంగా గత 20 సంవత్సరాల నుండి పర్మినెంట్ కోసం టురిజం కార్మికుల పోరాటాలు చేస్తున్న, యాజమాన్యం, ఇప్పటికీ నిర్లక్ష్యం గా ఉంది. భవిష్యత్తులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కే. రామారావు, మాడగడ మాజీ సర్పంచ్ అర్జున్, ఐకెపి ఉద్యోగి కేశవ్ తదితరులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU