
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1: ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పార్టీకార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య మూసాపేట యాదవ బస్తీలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా పని అనుకుంటే సాధించి చూపెడతారని అందుకు నిదర్శనం ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అన్నారు. దేశంలో ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.ఈ పథకం ద్వారా లక్షల మంది పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.గతంలో లావు రకం బియ్యం లబ్ధిదారులు అమ్ముకునేవారని ప్రస్తుతం ఈ సన్న బియ్యం పంపిణీ ద్వారా అలాంటి పరిస్థితి ఏర్పడదన్నారు. అదేవిధంగా పేద, వెనుకబడిన యువతకు ఆర్దికంగా చేయూతనిచ్చేందుకు రాజీవ్ యువశక్తి పథకాన్ని ప్రారంభించారన్నారు.
ఈ పథకం ద్వారా రూ.50 వేల నుండి నాలుగు లక్షల వరకు ఆర్దిక సాయాన్ని అందిస్తారని ఇందులో 75 శాతం సబ్సిడీ ఇవ్వడం ద్వారా యువతకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలన్నారు. మరియు అక్కడ ఏర్పాటు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజలందరూ కార్యకర్తలందరూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, బండి రమేష్ నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో సివిల్ సప్లై అధికారులు ఏసిఎస్ఓ కళ్యాణ్ కుమార్, డి.టి శృతి, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్క పెంటయ్య,రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.
సంజీవరెడ్డి, మనోజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ,ఎ బ్లాక్ అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి, బి. బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, వైస్ చైర్మన్ ప్రకాష్,మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య,కూకట్పల్లి నియోజకవర్గం ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కర్క నాగరాజు,సీనియర్ నాయకులు రఘు,సాధు ప్రతాప్ రెడ్డి, తూము మనోజ్ కుమార్, ఎల్లేష్ యాదవ్, మొయిజ్, సలీం, స్వరూప,నర్సింహా యాదవ్,కర్రేమ్మ, సతీశ్ రెడ్డి,కృష్ణా రాజపుత్,శివ చౌదరి,సుధాకర్ రెడ్డి,రాచమల్ల శేఖర్ గౌడ్, మల్లేష్ యాదవ్,తూము సంతోష్ కుమార్,భాశెట్టి నర్సింగ్ రావు, ఎడ్ల ప్రభాకర్, ఎడ్ల సుధాకర్, అంజిగౌడ్, చున్ను పాషా, కొండల్, కర్క నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
