
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి, వికరాబాద్ జిల్లా కలెక్టర్ ను అదేశించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్సీఎస్టీ బాలికలను కులం పేరుతో దూషించి దాడి చేసిన వికారాబాద్ జిల్లా కొత్త గడి సొషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సాయిలతను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక,యంవి పౌండెషన్ సంస్ధలు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు పిర్యాదు చేయగా స్పందించింన చైర్మన్ బక్కి వెంకటయ్య వికారాబాద్ జిల్లా కలెక్టర్ పొన్ చెసి బాలికల పై దాడి సంఘటన వివరాలను తెలుసుకొని బాలికల పై దాడి చేసి,కులం పేరుతో అవమానించి న ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.సస్పెండ్ చెసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రోహిత్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
