TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( హుకుంపేట ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం, ప్రధాన మంత్రి అవాస్ యోజన 2.0,ప్రధాన మంత్రి జన్ మన్ గృహలను ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలని, బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు పేర్కొన్నారు. మఠం పంచాయతీ,మఠం కోలని గ్రామం లో నిర్మాణ దశలో వున్నా ప్రధాన మంత్రి జన్ మన్ గృహలను అయన స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్ మోహిని తో కలిసి పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ నిరుపేద,బడుగు బలహీన, గిరిజన వర్గాల అభివృద్ధికి కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. గత వైస్సార్సీపీ పాలన లో లబ్ది దారులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా” ఇచ్చి ఇళ్లను మరిచిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం గృహల కోసం ఇచ్చిన నిధులను ప్రజలకు అందించలేక పోవటం తో అర్హులైన లబ్దిదారులకు, నిరాశ మిగిలిందని తెలిపారు. కేంద్రం లో మరియు రాష్ట్రం లో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరల ప్రధాన మంత్రి అవాస్ యోజన 2.0,ప్రధాన మంత్రి జన్ మన్ యోజన పధకాన్ని పట్టాలెక్కించరనీ అన్నారు. గతం లో మంజూరు చేసిన గృహ లు మధ్యలో ఆగిన వాటి పునర్నిర్మాణం కోసం అలాగే పెరిగిన ఖర్చుల దృష్ట్యా నూతన గృహల లబ్దిదారుల కొరకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం 3220 కోట్ల రూపాయలు అదనపు సహాయం కింద విడుదల చేసిందని అన్నారు. అలాగే మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సి లకు 50 వేలు, బిసి లకు 50 వేలు, ఎస్టి లకు 75 వేలు, పీవిటిజి వర్గాల కొరకు లక్ష రూపాయలు అదనపు సహాయం గా పెంచడం జరిగిందనీ స్పష్టం చేసారు.

ఏప్రిల్ 30 వరకు నూతన గృహల కొరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నందున అర్హులైన వారు రేషన్ కార్డు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పాస్ ఫొటోస్ పట్టుకుని స్థానిక సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ నీ కలిసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.గృహ నిర్మాణం కోసం అదనపు సహాయం గా 322 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కు అరకు పార్లమెంట్ గిరిజన ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక బీజేపీ నాయకులు డి రామలింగం, ప్రశాంత్, అంజలి నాయుడు, సదా శివ,వార్డు సభ్యులు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prime Minister's Awas Yojana