TRINETHRAM NEWS

సంగారెడ్డి: చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది.
రామచంద్రాపురానికి చెందిన చిగురు శ్రీను.. రాయసముద్రం చెరువులో రెండేళ్ల పాటు చేపలు వేసుకుని పెంచుకునేందుకు కాంట్రాక్టు తీసుకున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా చేపలను పట్టుకొని వెళ్తారేమోనని కారు వేసుకొని కాపలాకు వచ్చాడు. అప్పటికే అక్కడ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు. శ్రీనును మాటల్లో పెట్టి దృష్టి మరల్చాడు. ఆపై కారును దొంగలించుకొని వెళ్లాడు. వేగంగా కారును తీసుకెళ్తున్న దృశ్యాలు కొద్ది దూరంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ మేరకు బాధితుడు రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.