నరేంద్రవర్మకు బ్రహ్మ రధం పట్టిన గ్రామ ప్రజలు.
అడుగడుగునా అక్క, చెల్లెమ్మలు ఆశీస్సులతో ముందుకు సాగిన నరేంద్రవర్మ
నరేంద్రవర్మ గెలుపుకి అనునిత్యం పాటుపడతామని హామీ ఇచ్చిన గ్రామస్థులు.
జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో బాపట్ల మండలం వెదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఉమ్మడి మినీ మేనిఫెస్టో ను మహిళామణులకు వివరించారు.అనంతరం తన గురించి వివరించే పుస్తకం మరియు చీర, చేతి సంచి ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు,సైనికులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…
👉 మహాశక్తి పథకం :
18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు రూ.1500 లు.
“తల్లికి వందనం” పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 లు
“దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం.
“ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా మహిళలందరికీ టికెట్లు లేని ప్రయాణం
👉 ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి “యువగళం నిధి” కింద నెలకు రూ. 3,000 లు.
👉 “అన్నదాత పథకం” కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 ల ఆర్థిక సహాయం.
👉 బీసీలకు రక్షణ చట్టం తెచ్చి… వారికి అన్ని విధాల అండగా నిలుస్తాము
👉 ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్
👉 ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు. పేదలను సంపన్నులను చేస్తామని తెలిపారు
👉 రాబోయే ఎన్నికలలో బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎం యల్ ఏ అభ్యర్థిగా పోటీచేస్తునాని ఆశీర్వదించి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.