
సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. గాలిపెల్లి కుమార్
Trinethram News : తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమని, దేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని గాలిపెల్లి కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభలో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన వైద్యశాఖ మంత్రిదామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలిపెల్లి కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం సాయంత్రం గాలిపెల్లి కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంలో ముఖ్యమంత్రి పాత్ర చాలా గొప్పదని, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు తెలపడం అభినందనీయమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం దాదాపు 30 ఏళ్లుగా దళితులు పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అనేక కుటుంబాలు త్యాగాలు చేశాయని పేర్కొన్నారు. కొందరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక బిల్లుతో దళితులు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కుమార్ వ్యాఖ్యానించారు.
వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని గాలిపెల్లి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందేలా అహర్నిశలు కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాలి పెల్లి కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
