తబితా ఆశ్రమం లో ఉన్న పిల్లలను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వహకులు
చదువు తో పాటు ఆహ్లాదం, విజ్ఞానం,సామాజిక స్పృహ మరియు క్రీడలు అవసరం మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లో గత కొన్ని వారాలుగా నడుస్తున్న ఎగ్జిబిషన్ కి రామగుండం లోని తబితా ఆశ్రమం లో ఉన్న పిల్లలను సోమవారం రాత్రి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో తీసికెళ్ళి ఎగ్జిబిషన్ లోని వివిధరకాల విద్యా, వైజ్ఞానిక, క్రీడలకు సంభందించిన వస్తువులను వారికి ఇప్పించడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తబితా ఆశ్రమంలో ఉన్న పిల్లలు చదువుతున్నప్పటికిని వారు ఆశ్రమానికె పరిమితం కాకుండా వారికి ఎగ్జిబిషన్ లో ఉన్న పలు రకాల ఆటలను, స్టాల్స్ ను చూపెట్టి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వారికి చదువు తో పాటు ఆహ్లాదం, క్రీడలు, విజ్ఞానం అవసరం అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ ఆశ్రమంలో ఉన్న పిల్లలు పైచదువులు చదివి ఉన్నత స్థాయి కి ఎదిగేందుకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నిర్వహకులు మారుపల్లి నవీన్ కుమార్, రెణికుంట్ల నరేంద్ర, వై.లెనిన్, హెల్పింగ్ హాండ్స్ శ్యామ్, తో పాటు ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ విమల దంపతుల తో పాటు తదితరులు పాల్గొన్నారు.
తబితా ఆశ్రమ పిల్లలకు ఉచితంగా ఎగ్జిబిషన్ సందర్శనకు అవకాశం కల్పించిన అస్లాం దినేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App