నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లాలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది జిల్లాలో మొత్తం 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వికారాబాద్ పట్టణంలో నాలుగు తాండూర్ పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 1026 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇందులో 51 మంది పరీక్షకు అనుపస్థితి కావడం జరిగింది మిగతా 975 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం జరిగింది అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేసి పరీక్షలను సజావుగా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి రేణుకా దేవి తెలియజేశారు పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ వస్తుంది వికారాబాద్ జిల్లాకు మొత్తం 74 స్కాలర్షిప్లు మంజూరు కావడం జరిగింది అనగా పరీక్ష రాసిన విద్యార్థుల నుండి 74 మంది విద్యార్థులను మెరిట్ ప్రాతిపాదిక మీద ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఎంపిక ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలో జరుగుతుందని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ పరీక్షల ఇన్చార్జి కే రామ్ రెడ్డి తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App