TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 23: మండలం వర్తనాపల్లి గ్రామంకు చెందిన కె.సంద్య అను నిండు గర్భిణీ స్త్రీకు (0+) గ్రూపు బ్లడ్ పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరం కావడంతో జనసేన పార్టీ నాయకులు అనిల్ కుమార్ ను సంప్రదించగా పాడేరు ప్రభుత్వ శిశు సంక్షేమ ఆసుపత్రికి వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ దానాలన్నిటిలోనూచాలా గొప్పది రక్తదానం అనేది చాలా గొప్పదనే చెప్పాలి.ఎందుకంటే ఏ దానం చేసినా వస్తువైనా, పదార్థమైన మనిషి కృత్రిమంగా తయారు చేసే అవకాశం ఉంది. కొన్ని క్రియేట్ చెయ్యచ్చు.. కానీ రక్తాన్ని మాత్రం సృష్టించలేం.అది కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే ఇవ్వాలి.స్వచ్చందంగా ఎటువంటి అపోహలు లేకుండా మనిషి రక్తదానం చెయ్యచ్చు అని రక్తదానం ఇచ్చిన అనంతరం మనకు చాలా ఆరోగ్యం ఉంటుందని వివరణ ఇచ్చారు.

ముఖ్యంగా చాలా చోట్ల కొందరు వ్యక్తులు రక్తదానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగి, ఆరోగ్య సమస్యలు వస్తే సదరు వ్యక్తులకి, రోగుల నుండి రక్తం ఇస్తే ఏమైపోతున్నామో అనే భయందోళనలతో ఉంటారు.కానీ అలాంటి భయందోళన అవసరం లేదు మనం చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నిండు ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవ్వుతామని తెలిపారు. మా అందరికీ. ఇలాంటి ఆలోచన స్ఫూర్తి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల.పవన్ కళ్యాణ్,జనసైనికులకు ఆదర్శమని ఎప్పటికీ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 3 నుండి 6 నెలలకు ఒకసారి స్వచ్చందంగా రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.

చిరంజీవి,పవన్ కళ్యాణ్ ,జన్మదిన వేడుకలలో అనేక మంది జనసైనికులు, మెగా అభిమానులు స్వచ్చందంగా సేవ ట్రస్టులకు రక్తదానాలు చేశారని,పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య పిలుపు మేరకు పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో అనేక మంది జనసైనికులు రెడ్ క్రాస్ సొసైటీ కి స్వచ్చందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు.

నిండు ప్రాణాన్ని కాపాడే అదృష్టం ఆ భగవంతుడు, అలాగే నా తల్లి తండ్రులు నాకు ఇవ్వడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నానన్నారు.ప్రతి ఒక్కరూ సమాజ సేవ చెయ్యాలని ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వాలని రక్తదానం చెయ్యండి ప్రాణదాతలు గా నిలవండి అని పిలుపునిచ్చారు.అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి జనసేన నాయకులు జనసేన శ్రేణులు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The most important donation