
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 14: నెల్లూరు జిల్లా: కావలి. కావలి ప్రజలను కాపాడిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డికి ప్రజల నుంచి అభినందనల వెల్లువ, కావలి:తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అక్కడి ప్రజలకు ఆర్థిక కేటుగాడు షేక్.సుభాని తన మాటల గారడీతో అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి లక్షకి 20,000 రూపాయల లెక్కన ఏజెంట్లకు కమిషన్లు ఇచ్చి సుమారు 200 కోట్ల రూపాయలు కట్టించుకుని అక్కడి నుంచి జంప్ అయ్యి అదే తరహాలో కావలి పట్టణంలోని ముసునూరులో ఉన్న మర్రిచెట్టు గిరిజన కాలనీలో మకాం పెట్టి అనంతార్థ అసోసియేట్స్ మనీ స్కాం పేరిట తాను షేర్ మార్కెట్ చేస్తానని ట్రేడింగ్ లో మంచి అనుభవం ఉందని నమ్మబలికి అద్భుతాలు చేస్తానని అధిక ఆదాయాలు వస్తున్నాయని నమ్మించి కొంతమంది ప్రభుత్వ అధికారులను వ్యాపారులను ఏజెంట్లుగా నియమించుకుని లక్షకి 20% కమిషన్ స్పాట్లో ఇవ్వడంతో ఇదేదో చాలా బాగుందని ఏజెంట్లు గా తయారైన వారు ఎగబడి వారి స్నేహితులు బంధువుల చేత అనేక అబద్ధాలు చెప్పి వారి స్థలాలు పొలాలు దగ్గరుండి అమ్మించి కట్టించారని సమాచారం అదేవిధంగా పర్సనల్ లోన్లు హౌసింగ్ లోన్లు అవసరం లేకపోయినా వీరే కలగజేసుకుని దగ్గరుండి బ్యాంక్ అధికారులతో మాట్లాడి లోన్లు ఇప్పించి మరీ కట్టించారని సమాచారం ఇదేవిధంగా రేపు మార్చిలో గ్రామాలలో రైతులు వడ్లు అమ్మిన డబ్బులను టార్గెట్ చేసి ఆ గ్రామాలలో సర్పంచ్ లను చిన్నచిన్న రాజకీయ నాయకులను తన ఏజెంట్లుగా మలుచుకుని రైతులు చేత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించాలనే వ్యూహం కూడా పన్నారనీ
ఈ విధంగా కావలి నియోజక వర్గంను టార్గెట్ చేసి ఇక్కడ రైతుల దగ్గర నుంచి సుమారు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు రేపు జూలై నెల లోపల కట్టించుకొని బాంబేకి మకాం మార్చాలని పక్కా వ్యూహం పన్నారని సమాచారం ఇదే జరిగి ఉంటే ఎంతమంది రైతులు వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకునేవారు స్థానిక ఎమ్మెల్యేకి ఎంత చెడ్డ పేరు వచ్చేదో ఒక్కసారి ఊహించుకుంటేనే తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మేలుకొని రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి దానికి చెక్ పెట్టడంతో కావలి నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి అభినందనలు తెలుపుతున్నారు.
ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని మరో ప్రాంతంలో ఈ విధంగా వ్యాపారాలు చేయకుండా నిఘా ఉంచాలని ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా లోపం వల్లనే పాత నేరస్తుడు అనేది కూడా తెలుసుకోకుండా అతను ఇచ్చిన కమిషన్లకు గిఫ్ట్ లకు ఆశపడి ఆర్థిక నేరగాడు సుభానికి సహకరించిన ఉన్నత స్థాయి అధికారులు అంటున్నారు కావలి పట్టణపు ప్రజలు,ఇంత పెద్ద ఉపద్రవాన్ని నష్టాన్ని ముందే ఊహించి కట్టడి చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి కావలి నియోజకవర్గ ప్రజలు అభినందిస్తున్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
