TRINETHRAM NEWS

తేదీ : 31/03/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం , ఏ కొండూరు మండలం, రేపూడి గ్రామపంచాయతీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు, ప్రసాద్ రెడ్డి, కార్యదర్శి హుస్సేను బాబు, నాయకులు టి. సీతారాములు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో గ్రామాన్ని ఏమి పట్టించుకోలేదని తెలిపారు.
డ్రైనేజీలు, వీధి పైపులు, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు ప్రజలకు ఉన్న సమస్యలను పట్టించుకోకుండా వైసిపి నాయకులు అప్పటి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులను మింగేసారని పేర్కొనడం జరిగింది. జగనన్న ఇల్లులని పేదలకు అప్పుడు ఇచ్చిన తరుణంలో ఎకరం 70 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. ఆ భూమి వైపు దారి లేక పేదవాళ్లు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ ఇళ్లకు వచ్చినటువంటి నిధులను కూడా వాడుకున్నారని వివరణ ఇచ్చారు .

వాలంటీర్ వ్యవస్థను వారి కార్యకర్తలను పెట్టి ఎవరైతే వైసిపి కుటుంబాలు ఉన్నాయో , ఆ కుటుంబాలలో అవినీతిపరులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఎక్కువ ఇళ్ల స్థలాలు ఇచ్చి, వేరే వాళ్లకు మాత్రం తక్కువ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేదు. కారణం ఏమిటంటే బడా బాబులు పేదలకు వచ్చినటువంటి ఇంటి రుణాలను అరటి తొక్క వలుసుకుని అరటి పండును నమిలి మింగేసినట్టు ఆ రుణాలను మింగడం జరిగింది.
అని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రం మొత్తం కూడా చీకటి గానే ఉందని, ప్రజలు ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన తర్వాత చీకటిలో నుండి వెలుతూరు వచ్చిందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పారు.
పార్టీ, కులం, మతం బేధాలు లేకుండా అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలపడం జరిగింది. గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వారిని అధిష్టానం గుర్తించి వారికి సపోర్టుగా నిలబడాలని అన్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలకు పరిష్కారం త్వరగా అవుతుందని తెలిపారు. మండల మరియు డివిజన్ , జిల్లా రాష్ట్రం నుండి గ్రామాలలో జరిగే సభలు కైనా, ప్రభుత్వ నుండి వచ్చే వివిధ పథకాలు గురించి ముందుగా ఒకరోజు ముందే పార్టీ అధ్యక్షులకు తెలియజేయాలని సూచించారు.

బడబాబులు మాటలే మండలం, నియోజకవర్గం, జిల్లా, పార్టీ బడా నాయకులు మరియు, ఎమ్మెల్యే ఎంపీలు వింటున్నారని, పార్టీలో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు వారి దగ్గర డబ్బు లేకపోయినా మంచి పని మాత్రం ఆగడం లేదు . అలాంటివారికి ఆపద వస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు? కడుపునిండా మందు పోపించి, బిర్యాని పెట్టించి, వేసి గదుల్లో కూర్చోపెట్టి మాట్లాడితే వారి మాటలు వింటారా? ఇలాగైతే ముందు ముందు తెలుగుదేశం పార్టీ సముద్రంలో కలిసి కాన రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీరిద్దరి మధ్య ఇండియా పాకిస్తాన్ యుద్ధంల, పెట్రోల్లో అగ్గిపుల్ల గీసివేస్తే బొగ్గుమన్నట్టు వీరి వ్యవహారం అలా ఉన్నది. కులం, మతం ధనం, పేదవాళ్ళ అని చూడకుండా ఎవరైతే పార్టీలో కష్టపడి పని చేస్తున్నారో అధిష్టానం నుంచి సర్వే చేయించి , వారిని గుర్తించి వారి సమస్యలకు పరిష్కారం చేసే విధంగా అధిష్టానం ఉండాలని పలికారు.
ఎమ్మెల్యే కొలికపూడి మంచి వ్యక్తి అని చెప్పడం జరిగింది. కొంతమంది అవినీతిపరుల రాజకీయ నాయకులు ఆయనపై బురద జల్లుతున్నారని వివరించారు. టిడిపి కార్యకర్త పార్టీలోకష్టపడి పని చేసి సభ్యత్వం తీసుకొనె లేపే కానరాకుండా పై లోకల్ కి వెళ్లడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబాన్ని గుర్తించి అధిష్టానం ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The leadership should be