ర్ కృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలిపిన తాండూర్ నేతలు
వికారాబాద్ జిల్లా: ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతిలో నామినేషన్ దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్యకు తాండూర్ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ అనునిత్యం దశబ్దాలుగా విద్యార్థి దశ నుండి మొదలుకొని ప్రతి రంగంలో బీసీల ప్రాబల్యం మెరుగుపడేలా సమాజంలో బడుగు బలహీన వర్గాల గొంతుకై వినిపిస్తున్న ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు, భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ మాట్లాడుతూ… బడుగుల ప్రతినిధి ఆర్ కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులుగా నామినేటెడ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బడుగు బలహీన వెనుకబడిన తరగతుల ప్రతినిధి ఆర్ కృష్ణయ్య తన జాతుల ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేశారని అలాంటి ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకున్న వారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ వారికి హృదయపూర్వక మైన శుభాకాంక్షలు తెలుపుతూ సమాజ హితం కోరి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ బిజెపి పార్టీ ప్రఖ్యాతిని ఎప్పటికప్పుడు పెంచుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కేంద్ర నాయకత్వానికి, తెలుగు రాష్ట్రల నాయకత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు , ఈకార్యక్రమంలో గుజ్జ కృష్ణ, ఉదయ్ కుమార్ నేతకాని తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App