TRINETHRAM NEWS

20లక్షల గ్రాట్యూటి అంశం తేల్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిరాశలో కార్మిక వర్గం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెబిసిసిఐ సభ్యులు మంద. నరసింహా రావు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

01.07.2016 నుండి 10వ వేతన ఒప్పందం మొదలవ్వగా కార్మికులకు ఆలస్యంగా 10.10.2017న 10వేతన ఒప్పందం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఆసమయానికి కేంద్ర ప్రభుత్వం గ్రాట్యూటిని 20 లక్షల పెంచుతూ చట్టం చేయకపోవడం మూలంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పెంచిన విధంగా గ్రాట్యూటీ చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ అధికారులకు 01.01.2017 నుండి వారి పది సంవత్సరాల వేతన ఒప్పందం మొదలు కాగా అధికారులకు వారి వేతన ఒప్పంద సమయం నుండి చెల్లించడం జరిగింది. చట్టం గేజిట్ నుండి 29.02.2018 నుండి 20 లక్షల గ్రాట్యూటీ అమలు చేస్తున్నారు. కానీ ఆలోపు దిగిపోయిన కార్మికులపై కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు యాజమాన్యం దాన్ని అపెక్స్ కమిటీకి రిఫరల్ చేయడం జరిగింది. ఆతర్వాత యాజమాన్యం కోల్ ఇండియా, సింగరేణి పది లక్షలకు మంది పైగా రావాల్సిన కార్మికుల వివరాలను సర్క్యులర్ ద్వారా ఇచ్చి వివరాలను సేకరించడం జరిగింది. దీనిని కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి మేరకు స్టాండ్లైజేషన్ కమిటకి ఆమోదం తరువాత వారి సిపారసు మేరకు అపెక్స్ కమిటీకి రిఫర్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో అపెక్స్ కమిటీ వాయిదా పడుతూ వచ్చింది, కానీ ఎలాంటి పురోగతి కనబడలేదు. అపెక్స్ కమిటీ ఆమోదం తరువాత ఈ అంశాన్ని అమలు విషయం మై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు పంపడం జరిగింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. 11వ వేతన వప్పందం సందర్బంగా యూనియన్లు దీనిపై బొగ్గు శాఖ మంత్రితో చర్చించగా ఎటు తేల్చ కుండా వఇదా వేశారు. కొందరు కార్మికులు కోలిండియాలో ఇంతకుముందే కోర్టులో కేసు వేయగా అక్కడి లేబర్ కమిషనర్ వడ్డితో సహా చెల్లించాలని సిపారస్ చేశారు. ఇదే అంశంపై సింగరేణిలోనూ ఒకరిద్దరు కోర్టులో వేయగా గ్రాట్యూటిని వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. కానీ ఇప్పటివరకు అట్టి నిర్ణయాన్ని యాజమాన్యాలు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో రియాజ్ లాంటి నాయకులు లేబర్ కోర్టులో మేము కేసు వేసి సాధించామని చెప్పుకోవడంతో కార్మికులు గందరగోళానికి గురవుతున్నారు. లేబర్ కోర్టులు ఇచ్చిన తీర్పులను కార్మికులందరికీ యాజమాన్యాలు అమలు చేయడం లేదని ఈఅంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడిపడి ఉన్నందున యాజమాన్యం సైతం నిర్ణయం తీసుకోక పెండింగ్ పెడుతున్నందున బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యులు మంద నరసింహ రావు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App