TRINETHRAM NEWS

Vijayawada: విచారణకు ఒకరి బదులు మరొకరు.. డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి ఆగ్రహం..

విజయవాడ: న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు సమానమే. కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణకు శ్రీనివాస్ రెడ్డి బదులు డ్రైవర్ వెళ్ళటంతో న్యాయమూర్తి గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఓ కేసు విచారణలో శ్రీనివాస్‌ రెడ్డికి బదులు మరొకరిని హాజరుపరిచినట్లు తెలుసుకుని ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ధర్నా కేసులో శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవటంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు శ్రీనివాస్‌ రెడ్డి కోర్టులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాలతో శ్రీనివాస్‌ రెడ్డి వెంటనే కోర్టు ముందు హాజరయ్యారు. ఆయనను జడ్జి మందలించారు..