
మాయ మాటలు చెప్పి గెలిచిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం
తేదీ : 12/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , ముచ్చనపల్లి గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ గ్రామ అధ్యక్షులు పెద్దిరెడ్డి . జముల రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం వైసిపి హాయంలో కులమత రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఇచ్చామన్నారు.
నవరత్నాలు కూడా అంద జే శం అని చెప్పడం జరిగింది. జరిగిన ఎలక్షన్ ల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం గెలుపు కు కారణం ఏవీఎంలు మోసం అని ప్రజలు అనుకుంటున్నారు ఉద్దేశ పూర్వకంగా చెప్పడం జరిగింది. అవి ప్రూఫ్ తే లనందున కూటమి గెలుపుకు ప్రజలే పట్టం కట్టారని చెప్పవచ్చు అని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన లేక రోడ్లు గాని, ఇంకా ఏమైనా సెనక్షన్ అయినా ఆ పార్టీ వాళ్లకే తప్ప వైసీపీ పార్టీ వాళ్లకు మాత్రం చెందడం లేదని తెలిపారు.
ముచ్చనపల్లి గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం గుర్తించి ఆ సమస్యకు పరిష్కారం అయ్యే దిశగా తక్షణమే చేపట్టాలని తెలిపారు. ఆయన రాజకీయ అనుభవం చాలా సంవత్సరాలు ఉందని చెప్పారు. మొట్టమొదటిసారిగా సి.పి.ఐ పార్టీలో పనిచేసినని, ఆ సిద్ధాంతాలు నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చానని తరువాత వైయస్ .రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసే సేవలు చూసి తాను జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో ఉన్నానని చెప్పడం జరిగింది.
ప్రజలకు సమస్య వస్తే నాకు తెలిసిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దిశగా నేనెప్పుడూ ముందే ఉంటానని అనడం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లు అని చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిందని, తక్షణమే ఆ సూపర్ సిక్స్ ల ను అమలు చేయాలని, పార్టీల విధితంగా కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు, నిధులు, అందజేయాలని పేర్కొన్నారు. తనకు 81 సంవత్సరాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
