TRINETHRAM NEWS

ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని- సీపీఐ ప్రదర్శన-ధర్నా

నెల రోజుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు

రాజమండ్రి పిబ్రవరి 10 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు లేని పేదవారికి నగరాలు, పట్నాలలో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల , ఇస్తామని కేబనెట్ లో ప్రకటించి కమిటీ వేశారని కానీ అ ప్రక్రియ వేగవంత చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు సోమవారము ఉదయం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు లేని పేదలు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అంతకముందు పేదలు ప్రదర్శన నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ గారికి 1550 అర్జీలు అందించారు

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పేదలకు నగరాల్లో సెంటు స్థలం, గ్రామాల్లో ఒకటిన్నర సెంట్లు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు చూపలేదని చూపలేదు అన్నారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారు, ఈ మొత్తం ఏమాత్రం నిర్మాణానికి సరిపోక ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోయారు అర్జీదారులు, సిపిఐ ప్రభుత్వ సమయంలోనే గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు నగరాల్లో నగరాల్లో రెండు సెంట్లు స్థలం గ్రామాల్లో మూడు సెంట్లు తో పాటు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని ప్రకటించడం సానుకూలమైన ప్రకటన . కూటమి ప్రభుత్వం ఆచరణలో స్థలాల కేటాయింపులు చేసి నేడు పెరిగిన సిమెంటు, ఇటుక, ఇనుము, కంకరు, తదితర సామాగ్రి ధరల దృష్టిలో ఉంచుకొని నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలకు రూ/ పెంచి గృహ నిర్మాణానికి మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేశారు .
లేని పక్షంలో ఇళ్ల స్థలాల అందోళన ఉద్రుదo చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కార్యవర్గ సభ్యులు ఎస్ నౌరుజీ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, కె శ్రీనివాస్, ఏ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి పి త్రిమూర్తులు కొండపర్తి రామకృష్ణ జట్ల సంఘము అధికారబాడి దేముడు బాబు అప్పళ్ళ నాయుడు, వెంకటరావు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The housing process announced