TRINETHRAM NEWS

యుత నీయులైన రాష్ట్రపతి, భారత దేశం కి నమస్కరించి వ్రాయునది.

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ని అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్‌ చేయుట గురించి 

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతిపత్రం అందజేయడం జరిగింది విన్నపము..

పై విషయాన్ని పురస్కరించుకుని తమరికి మనవి చేయునది ఏమనగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌ సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అవమానపర్చడం జరిగింది. అంబేద్కర్‌ పేరు జపించడం కంటే రాముని పేరు జపిస్తే పుణ్యం వస్తుందని భారత రత్నను అవమానపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఇ యోక్క కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి హాజరై మాట్లాడుతూ
రాజ్యాంగ నిర్మాత, దళిత, బడుగు వర్గాల ఆశాజ్యోతి, దళితులు ఆరాధ్యంగా భావిస్తున్న అంబేద్కర్‌ కేంద్ర మంత్రి హోదాలో నిండు పార్లమెంట్‌ సభలో అమిత్‌షా అవమానపర్చడం అంటే భారత జాతి మొత్తాన్ని అవమానించడమే. ఈ వాఖ్యలతో అమిత్‌షా కేంద్ర మంత్రి పదవికి అనర్హుడిగా భావిస్తున్నాము.
కావున వెంటనే అనర్హుడైన అమిత్‌షా ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భారత జాతి గౌరవాన్ని కాపాడగలరని సవినయముగా కోరుతున్నాము. అని తెలియ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత మల్లయ్య,పాత పెళ్లి ఎల్లయ్య, ముస్తఫా, తిరుపతి,బొమ్మక రాజేష్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, దాసరి సాంబమూర్తి, గడ్డం శ్రీనివాస్, బాబు మియా, కుంట సది,అల్లి శంకర్, దొంతుల కిరణ్, పవన్, సర్వేశ్, తేజ తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App