TRINETHRAM NEWS

Trinethram News : ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ రూ. లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ రూ.76 వేలు, నక్కల జగదీష్ రూ.2లక్షలు గత ఏడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బును పోస్టాఫీసు ఖాతాలో జమచేశారు

అయితే ఈ డబ్బు జమచేసిన వెంటనే గత సంవత్సరం సంబంధిత అప్పటి పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైంకు పాల్పడడంతో పోలీసులు కేసునమోదు చేశారు.. ఈ క్రమంలో రైతులకు రావాల్సిన డబ్బులు సంబంధిత ఢిల్లీ బ్యాంక్ హోల్డ్లో ఉంచారు

అయితే కొంతమంది రైతులకు
అప్పుడు జరిగిన ఆందోళనతో కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో డబ్బులు చెల్లించడం జరగగా.. మరికొంతమంది రైతులకు చెల్లింపులు కాలేదు

దీంతో ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ లోని ఎస్బీఐ బ్యాంకులో కొంత మంది రైతులు చొక్కాలు విప్పి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Half-Naked Demonstration