TRINETHRAM NEWS

The government should take moral responsibility for the death of a one and a half year old boy in the attack of these dogs

— జవహర్ నగర్ ప్రజాసమస్యల సాధన కమిటిలోని ప్రజాసంఘాలు.
— బాధిత కుటుంబానికి 20 లక్షల ఏక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.

త్రినేత్రం న్యూస్ జవహర్ నగర్ కాప్రా మేడ్చల్ జిల్లా ప్రతినిధి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
ఏడాదిన్నర విహాన్ అనే పసిబాలుడు పై మంగళవారం రోజు సాయంత్రం వీధి కుక్కలు దాడి చేశాయి. నోట కరుచుకొని సుమారు వెయ్యి గజాల వరకు ఈడ్చికెళ్ళి, తల పై పొర వేంట్రుకలతోసహా ఊడిపోయి, తలలోని మెదడు కొంతబాగం భయటపడి చనిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ్ కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు, స్థానిక పాలకవర్గం, అధికారులు నైతిక బాధ్యత వహించాలని జవహర్ నగర్ ప్రజా సమస్యల సాధన కమిటీలోని అభ్యదయ రచయిత ఎస్.కె.మీరా, కార్మిక మహిళా సమాఖ్య షేక్ మస్తాన్ బీ, ఐ.ఎఫ్.టి.యు. శివబాబు, ఐ.ఎఫ్.టి.యు.(శ్రామీక స్పందన) షేక్ షావలి, ఏ.ఐ.ఎఫ్.టి.యు. మల్లేష్ తదితరులు పాత్రికేయులకు పంపిన ఒక సంయుక్త పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

సిద్దపేట జిల్లా, మిరిదొడ్డికి చెందిన భరత్, వెంకటలక్ష్మి అనే దంపతులకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టిన విహాన్ అనే ఏడాదిన్నర గల మగ సంతానం అని గుర్తుచేశారు. బతుకు తెరువులో బాగంగా మేడ్చల్, కాప్రా పరిధిలో గల జవహర్ మున్సిపల్ కార్పోరేషన్, 28 డివిజన్, ఆదర్శ్ నగర్ కాలనీలో 2024, జూలై-16, చీకటిపడుతున్న వేళ, 7 గంటల ప్రాంతంలో జరిగిందని అన్నారు. ఇంటి గేటు వద్ద వరకు ఆడుకుంటూ వచ్చిన పసిబాలుడిపై సుమారు 10-15 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేసి, పొట్టన పెట్టుకున్న కుక్కలపై మూడు నెలల కిందటనే స్థానిక భస్తీ ప్రజలు మున్సిపల్ కమీషన్ ద్రుష్టికి తీసుకెళ్ళారని గుర్తుచేశారు.

ఈ కాలంలో పాదచారులు, వ్రుద్దులు, మహిళలు కుక్కల గాట్లకు బలైయ్యారని గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా నేడు ఒక పసికందు ప్రాణాలు పోవడానికి కారణ మయ్యారని ఆగ్రహించారు. అక్కడి చికేన్ షాపుల నుండి వెదజల్లే చెత్త వల్ల అపరిశుభ్రత, దుర్ఘందం, వీధి లైట్లు లాంటి కనీస మౌళిక వసతులు కూడ లేకపోవడం వలన కూడ పసి ప్రాణం పోవడానికి మరోకారణంగా వెల్లడించారు. అంతేగాక వికలాంగుల కాలనీలో చివరగా ఉన్న ఆదర్శ్ నగర్ చాలా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం అవ్వడం వలన కొందరు యువవకులు గుంపులు గుంపులుగా చేరి మధ్యం, గంజాయి సేవించే బ్యాచుల వలన సాయంత్రం ఆరు దాటంగానే ఎవరుకూడ ఇళ్ళ నుండి భయటకు వచ్చేవారు కాదని అన్నారు.

అందువల్ల కూడ ఈ పసిబాలుడి ప్రాణం పొయ్యిందని తెలియజేశారు. వెంటనే స్థానిక భస్తీ ప్రజలకు గంజాయి, మధ్యం సేవించేేవారి నుండి తగిన భద్రతోపాటు, మౌళిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు యుద్ద ప్రాతిపదికన చేేపట్టి, సంబందిత బాధిత కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకు 20 లక్షల ఆర్థిక నష్టపరిహారం, ఒకరికి మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం, ఒక డబుల్ బెడ్ రూం గాని లేదా 120 గజాల ఒక ప్లాటును కేటాయించాలని, తక్షణం అంత్యక్రియల కింద ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని మీరా, మస్తాన్ బీ, శివబాబు, షేక్ షావలి, మల్లేష్ డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government should take moral responsibility for the death of a one and a half year old boy in the attack of these dogs