తేదీ:24/01/2025
కిడ్నీ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
తిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, ఏ. కొండూరులో సిపిఐ జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి కిడ్నీ బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. డయాలసిస్ సెంటర్లో రోగులకు సరైన సదుపాయాలు లేవని శంకర్ వెల్లడించారు. మార్చిలోగా పైప్ లైన్ పనులను వేగవంతం చేసి కృష్ణా జలాలను ఏ. కొండూరు, తిరువూరుకు తీసుకువచ్చి కిడ్నీ బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App