AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
Trinethram News : అమరావతి..
ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు..
ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల కార్మిక సంఘాలు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికీ 32 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో మరోసారి చర్చలు జరపనున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు.. సమ్మె విరమించుకోమని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీలు..