TRINETHRAM NEWS

రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ.. చిహ్నంగా సూర్యుడు, దేవ కాంచన చెట్టు.. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కాగా రామాలయంపై ఎగురవేయాల్సిన జెండా డిజైన్‌ను మార్చినట్లు సమాచారం…
రామ మందిరం పై ఎగిరే జెండాపై ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై శ్రీ రామ్ నినాదం, కోవిదర్ చెట్టు (దేవ కాంచన చెట్టు) చిహ్నంగా చిత్రీకరించబడింది. శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి 100 జెండాలను పంపుతున్నారు. రేవాలోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు…
ఇటీవల రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి లలిత్ మిశ్రా రామాలయం జెండా ముసాయిదాను కూడా అందించారు. ఐదుగురు సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్‌ను కమిటీ ముందుంచనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. రామ మందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది…
సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్