TRINETHRAM NEWS

భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపెల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు
పెద్దపల్లి, మార్చి-03,త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆన లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ అన్నారు సోమవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ , విద్యాశాఖ సంచాలకుల నరసింహారెడ్డి తో కలిసి మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపు పై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ మాట్లాడుతూ ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, నేరుగా ఆన్ లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు గల అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు
రాష్ట్రంలో ముందస్తుగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్ లైన్ బిల్లులో చెల్లింపు ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలలో ముందుగా ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని, నెలరోజుల పాటు ఆ మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్ లైన్ ద్వారా త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు జరపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App