TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు ఓకే విడత లో నష్టపరిహార చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.
భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం ద్వారా తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
దుద్యాల మండలం, హకీంపేటలో పట్టా భూమి కలిగిన 32 మంది రైతులు 29 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్ కు తమ భూములను కేటాయించేందుకు సమ్మతి తెలుపనైనది. పారిశ్రామిక పార్కు కు భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహారం కింద 5,80,00,000 /-కోట్ల రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందన్నారు..
ఈ కార్యక్రమం లో దుద్యాల మండలం తహసీల్దార్ కిషన్, జి సెక్షన్ సూపరింటెండెంట్ నాఫీస్ ఫాతిమా, టీ ఎస్ ఐ ఐ సి అసిస్టెంట్ మేనేజర్ అనురాధ, సిబ్బంది తదితరులు ఉన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The district collector handed