
డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్.
డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ అన్నారు. నేడు (గురువారం) తిండి పట్టణ కేంద్రంలో కనుగుల మంజుల శ్రీనివాసులు షాప్ నెంబర్ 2లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి తిండి మండల కేంద్రం పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం 200958 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి మనిషికి ఆరు పిల్లల చొప్పున ప్రతి ఒక్కరికి చల్ల బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని., మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తుందని ఇందులో భాగంగా మొదటిసారిగా మహిళలకు ఉచిత బస్సు, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని ప్రతి ఒక్క కుటుంబానికి 500లకే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క అర్హులైన పేద కుటుంబానికి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని నివేదిక వర్గంలోని చెరువులో నుండి పంటల సమృద్ధిగా పండించుకున్నారని అన్నారు.
నీళ్లు నిధులు నియమాకాలు అనేది ప్రభుత్వ లక్ష్యం అని, దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ రమణారెడ్డి, అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ దేవరకొండ మౌనిక, తిండి మండలం తహసిల్దార్ ఆంజనేయులు, మండల పరిషత్ అధికారి వెంకన్న, డివిజినల్ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి, డిండి మైనార్టీ అధ్యక్షులు షేక్ ఉమర్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీద సాయి కుమార్, మత్స్యశాఖ అధ్యక్షులు కాశన్న, శ్రీనివాస్ గౌడ్, పొలం లక్ష్మణ్, పోశాలు, రేఖ్యానాయక్, మాజీ ఎంపీటీసీ బుష్పాక వెంకటయ్య , నల్లగంతుల వెంకటయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
