
త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 22: నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గం లోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది అబ్ధిదారులకు రూ. 22,05,000 చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని,దళితుల పార్టీ తెలుగుదేశం పార్టీ అని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు , పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి అనుసుదిత్ జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా పియం అజయ్ ఉన్నతి ఋణాల పంపిణీ కార్యక్రమము నిర్వహించారు
,ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిని పి.వెంకట లక్ష్మమ్మ తో కలిసి కావలి నియోజకవర్గం లోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 మంది అబ్ధిదారులకు రూ. 22,05,000 చెక్కులను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఒక సంవత్సరం పూర్తికాకుండానే ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఇప్పటికే కావలి నియోజకవర్గం లో రోడ్లు,డ్రైన్ లు నిర్మించడంతోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు కోటి రూపాయల వరకు లబ్ధిదారులకు అందించడం జరిగింది అన్నారు..ఇంకా బీసీ, కాపు,వైశ్య,పలు అనుసంధాల ఉప కులాలకు చెందినవారు కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వీరందరికీ పార్టీలు, కుల మతాలకు అతీతంగా త్వరలోనే రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ ఆర్బర్,,దగదర్తి విమానాశ్రయంను కూడా త్వరలోనే పూర్తిచేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.. ఈ కార్పొరేషన్ రుణాలు పొందిన లబ్ధిదారులు నగదును దుర్వినియోగం చేయకుండా మీరు అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలని ఆయన తెలియపరచాలి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
