అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ?

TRINETHRAM NEWS

Trinethram News : 8th Jan 2024 : ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలకు డెడ్ లైన్ నేడే.! ఏం జరుగుతోందని సర్వత్రా ఉత్కంఠ?

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడిల సమ్మె పై ఉత్కంఠ నెలకొంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం. వారు విధుల్లో చేరేందుకు జనవరి 8వ తేదీను డెడ్ లైన్ గా నిర్ణయించింది.

ఇప్పటికే ఈ విషయం రాష్ట్రంలో ఉన్న అంగన్వాడిలకు మెసేజ్ పంపారు. రేపటి నుంచి ఐసీడీఎస్ పీ ఓల ద్వారా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఐతే అంగన్వాడీలు తమ డిమాండ్స్ పూర్తిగా నెరవేర్చే వరకు వెనుకకి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top