The criminals who brutally raped and murdered a junior doctor in Kolkata should be punished severely
గోదావరిఖనిలో సింగరేణి మహిళా కార్మికురాలు స్వప్న పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం.
CPI ML మాస్ లైన్ ప్రజా పంథా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్రాల పాలకులు ప్రభుత్వ వైద్యవ్యవస్థల పట్ల దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఈ అంశాలన్నీ కూడా దేశవ్యాపిత ప్రభుత్వ హాస్పిటళ్లలో అభద్రతా వాతావరణానికి, డాక్టర్లపై దాడులకు కారణంగా వున్నాయి. కలకత్తాలోమహిళా డాక్టర్ పై జరిగిన అమానుష హత్యాకాండపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నేరస్తులందరినీ కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళా వైద్యుల, ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి
ఆసుపత్రులలో, కాలేజీల్లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించేలా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టు అమలుచెయ్యాలి. మహిళలపై నిత్యం జరుగుతున్న హింసాత్మక లైంగిక దాడులకు, హత్యలకు వ్యతిరేకంగా మన నిరసనను, ఆగ్రహాన్ని బలమైన గొంతుతో వ్యక్తం చేద్దాం. పని ప్రదేశాల్లో మహిళలరక్షణ కోసం నిర్దిష్టమైనచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం
నేరస్తులను కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించాలని నిరవధికంగా ఆందోళన సాగిస్తున్న వైద్య విద్యార్థులకు మద్దతు తెలియజేస్తూ యావత్తు ప్రజానీకం స్పందించి, వీరికి అండగా ఉండాలని మద్దతు నివ్వాలని పిలుపునిస్తున్నాం
గోదావరిఖనిలో సింగరేణి లో పనిచేస్తున్న దళితమహిళా కార్మికురాలు సప్న పై జరిగిన దాడిని సీపీఐ ఎమ్ ఎల్ మాస్ లైన్ ప్రజాపంథా తీవ్రంగా ఖండిస్తున్నది*. పోరాటాల సంఘంగా, త్యాగాల చరిత్ర అని చెప్పుకునే సింగరేణి గుర్తింపు సంఘం నాయకుడు ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు రావడం విచార కరం. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి స్వప్న పై దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై దాడులు వేధింపులను అరికట్టే విధంగా సింగరేణి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ఘటన కమ్యూనిస్టు పార్టీలపై చెడు ప్రభావాన్ని చూపే విధంగా, తప్పుడు ఆలోచనలు కలిగే విధంగా ఉన్నది. AITUC నాయకత్వం కూడా ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నాం. ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో పౌర హక్కుల సంఘం లాంటి నిబద్ధత కలిగిన సంఘాలు ఈ ఘటనపై విచారించాలని కోరుతున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App